చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి*
ఇద్దరికీ తీవ్ర గాయాలు
చేవెళ్ల, ఏప్రిల్ 1 (మనఊరు ప్రతినిధి): అతివేగం, అజాగ్రత్తతో బైక్ నడుపుతున్న చెట్టును బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. చేవెళ్ల మున్సిపల్ కేంద్రానికి చెందిన కొనసారి సాయి కుమార్(38) తన భార్య దివ్య, చెల్లెలు దీపికలతో కలిసి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు బైక్ (TS07FC3275)పై శంకర్ పల్లిలోని చందిప్ప శివాలయానికి పయనమయ్యారు. ఈక్రమంలో చేవెళ్ల మండల పరిధిలోని బండారి శ్రీనివాస్ కాలేజ్ గేట్ సమీపంలోకి రాగానే బైక్ అతివేగంగా వెళ్లి రోడ్డుపక్కన చెట్టును బలంగా ఢీకొట్టింది. దాంతో వారంతా బైక్పై నుంచి ఎగిరి పడ్డారు. సాయి కుమార్ తలకు, శరీర భాగాలకు బలమైన గాయాలు. అలాగే తన భార్య దివ్య, చెల్లెలు దీపికలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చేవెళ్ల మండల కేంద్రాన్ని పట్నం మహేందర్ రెడ్డి ఆసుప్రతికి గుర్తించారు. అక్కడ సాయి కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
