కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బీసీ దళపతి ఆర్ కృష్ణయ్య పోరాట ఫలమే

 కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బీసీ దళపతి ఆర్ కృష్ణయ్య పోరాట ఫలమే 

జడ్చర్ల రూరల్, మే 2 (మనఊరు ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బీసీ దళపతి ఆర్ కృష్ణయ్య పోరాట ఫలమేనని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయాదవ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో బీసీ జాగృతి సేన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం త్వరలో చెప్పటబోయే దేశ జనాభా గణనలో బీసీకులాలగణన చెప్పడతామని ఏప్రిల్ నెల 30న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయాదవ్ తెలిపారు. దేశంలో తొలిసారిగా కులాలకు చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ రాష్ట్రమే మార్గదర్శకమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం ఆశా స్పదమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది సమగ్ర కుటుంబ సర్వే అని, సంపూర్ణంగా బీసీ కులాల లెక్కలు ప్రకటించలేదని అన్నారు. దేశంలో తొలిసారి సంపూర్ణ కుల గణన చేపట్టింది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశ జనాభా గణనలో కులాల గణన చేపడతామని తీసుకున్న నిర్ణయం వెనక రాజ్యసభ సభ్యులు బీసీ దళపతి ఆర్ కృష్ణ య్య 45సంవత్సరాల పోరాట ఫలితమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కులాల ఘనంగా చేపట్టిన వెంటనే, పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి జనాభా దామాషా నిష్పత్తి అని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, చట్టసభలలో రిజర్వేషన్లు  కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి జాగృతి సేన నియోజకవర్గ అధ్యక్షులు నిరంజన్, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లింగంపేట్ శేఖర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాల్, శివ శంకర్, మండల ప్రచార కార్యదర్శి గోండ్ల రాములు, మండల కార్యదర్శి చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.