* స్వయం ఉపాధిలో యువత పాత్ర కీలకం*
*అన్ని రకాల ఆన్లైన్ సేవలకు సంబంధించి ఎటు జెడ్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రారంభం
*ప్రారంభించిన ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ రెడ్డి
మహబూబ్ నగర్, షాద్ నగర్, మే 1 (మనఊరు ప్రతినిధి): సమాజంలో యువత పాత్ర ఎంతో కీలకమైందని, రాజకీయంగానైనా, వ్యాపార పరంగానైనా, సమాజ సేవ పరంగానైనా యువత ముందుండి నడిపించాలని, స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడి ఎందరో యువకులు వ్యాపార రంగంలో రాణిస్తున్నారని, అలాగే కలిమొద్దీన్ కూడా వ్యాపార రంగంలో అద్భుతంగా రాణించాలని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. స్థానిక అయ్యప్ప కాలనీలో ఏ టు జెడ్ ఆన్లైన్ మొబైల్ సర్వీసెస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాగర్ కుంట నవీన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ ను, బీఆర్ఎస్ యువ నాయకుడు సుదీర్ ను యజమాని కలిమొద్దీన్ సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సన్మానించి పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ఎ టు జెడ్ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ను కలిగి ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి యువత స్వశక్తితో, ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా తమకున్న నైపుణ్యంతో వ్యాపార రంగంలో రాణించాలని, తద్వారా సమాజానికి మంచి సేవ చేసిన వారు అవుతారని, కుటుంబ బాధ్యతలను పంచుకున్న వారు అని, సమాజాన్ని అభివృద్ధి పరిచిన వారవుతున్నారని, స్వశక్తితో తనకున్న నైపుణ్యంతో యువతేజం కలీమొద్దీన్ ఎటు జెడ్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించడం సంతోషకరమని, వ్యాపారంలో ఉన్నతంగా రాణించాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని కలీమొద్దీన్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎ టు జెడ్ ఆన్లైన్ సెంటర్ యజమాని కలిమొద్దీన్ తమ ఆన్లైన్ సెంటర్లో అన్ని రకాల అప్లికేషన్లు, అన్ని రకాల ఆన్లైన్ జాబ్ అప్లికేషన్లు, ఆధార్ సర్వీసులు, భూ భారత సర్వీసులు, పాన్ అప్లికేషన్లు, పాస్ పోర్ట్ సర్వీసులు, ఓటర్ ఐడి కార్డ్ అప్లికేషన్లు, ఆర్టిఏ మరియు ప్రాపర్టీ టాక్స్ చెల్లింపులు, వాహనాలు ఇన్సూరెన్సులు, మున్సిపల్ ట్రేడ్ లైసెన్సులు, కార్మికుల లైసెన్సులు, నగదు లావాదేవీల చెల్లింపులు, ఎంఎస్ ఎం ఈ ఉద్యమ నియామకాలు, ప్రధానమంత్రి కిసాన్ యోజన అప్లికేషన్లు, ఇంకా అనేక రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలందరూ ఈ వినియోగించుకుని ఆన్లైన్ సెంటర్ సేవలను ఉపయోగించాలని. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, బీఆర్ఎస్ నాయకుడు సుదీర్, కొనసాగుతున్నారు.




