ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
జడ్చర్ల రూరల్, మే 24 (మనఊరు ప్రతినిధి): ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పుట్టిన రోజు వేడుకలను జడ్చర్ల పట్టణంలోని ఆయన గృహంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ను శాలువాతో సన్మానించి వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేశారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కుటుంబ సమేతంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు రేణుక, వడ్ల బాలస్వామిచారి, ఎ.వెంకటయ్య, పష్సియోద్దీన్, మాజీ ఉప సర్పంచ్ కోళ్ళ కృష్ణ, బుడగ జంగాల సంఘాల అధ్యక్షులు ఈభూతి కాశిం, శివ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.