హనుమాన్ చాలీసా చదవితే అద్బుతాలు సాధించవచ్చు

 హనుమాన్ చాలీసా చదవితే అద్బుతాలు సాధించవచ్చు

గద్వాల, మే 3 (మనఊరు ప్రతినిధి): హనుమాన్ చాలీసా చదవితే అద్బుతాలు సాధించవచ్చని గాయత్రి శ్రీనివాసులు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని శాంతినగర్ శ్రీ పల్లె ఆంజనేయస్వామి దేవాలయంలో నేటి సాయంత్రం శనివారం పురస్కరించుకొని హనుమాన్ చాలీసా పారాయణం, గోవింద నామ జపం, భక్తి గీతాలు పాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యాన్ని పదిలంగా రక్షించుకోటానికి హనుమాన్ చాలీసా పారాయణం చాలా బాగా పని చేస్తుందని అన్నారు. మందులు వాడుతూ, ఒక క్రమంలో  ముఖ్యంగా ఏల్నాటి శని, అర్ధాష్టమ శనిగాని, అష్టమశని గాని గోచార వశాత్తు జరుగుతున్నప్పుడు, శని మహర్ధశగానీ, శని వేధలు కానీ కలుగుతున్నప్పుడు హనుమాన్ చాలీసాను రోజుకు 11 సార్లు క్రమం తప్పకుండా చదివినట్లైతే శని వలన వచ్చే ఆనారోగ్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రుడు, కురువ వెంకటేశ్వర్లు, అమరవాయి మదనమోహన్, మురళీమోహన్, ఉపాధ్యాయులు  మధులేటి, మహానంది, జనహిత మాతాజీ పద్మ, ఇతర మహిళలు చిన్నారులు, పాల్గొన్నారు.