జిల్లా డాక్టర్స్ సెల్ చైర్మన్‌గా డాక్టర్ పి.జె. బాబు

 వనపర్తి జిల్లా డాక్టర్స్ సెల్ చైర్మన్‌గా డాక్టర్ పి.జె. బాబు నియామకం

వనపర్తి, మార్చి 16 (మనఊరు ప్రతినిధి): వనపర్తి జిల్లా మెడికల్ & హెల్త్ వింగ్ విభాగానికి డాక్టర్స్ సెల్ చైర్మన్‌గా కొత్తకోట పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ పి.జె. బాబును నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా డాక్టర్ పి.జె. బాబు నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి.జె. బాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి, డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, జిల్లా స్థాయిలో వైద్యులు మరియు ఆరోగ్య రంగ అభివృద్ధికి కృషి చేస్తానని డాక్టర్ పి.జె. బాబు తెలిపారు.