నంది హిల్స్ ఈస్ట్‌లో కొత్త వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు

నంది హిల్స్ ఈస్ట్‌లో కొత్త వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు

ప్రాంత అభివృద్ధికి నివాసితుల ఐక్యత

సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి


మీర్పేట్, ఏప్రిల్ 12 ( మనఊరు ప్రతినిధి): మీర్పేట్ లోని నంది హిల్స్ ఈస్ట్ ప్రాంతంలోని సర్వే నెం.30 భాగంలో కొత్తగా నంది హిల్స్ ఈస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారం నూతనంగా ఎన్నుకున్నారు. రోడ్ నెం.21 వెస్ట్ పార్ట్ నుండి రోడ్ నెం.22, 23, 24 వరకు విస్తరించిన ఈ ప్రాంత ప్రజలు ఒకే వేదికపైకి వచ్చి సంఘాన్ని స్థాపించడం విశేషం. అసోసియేషన్ రిజిస్టర్ నం: 09/2025తో అధికారికంగా నమోదు చేయబడింది. ఈ సంఘం ద్వారా ప్రాంత అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సభ్యులు సంకల్పించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులుగా చిందం పర్వతాలు, ఉపాధ్యక్షులుగా ఎ. సంతోష్ రెడ్డి, చెన్నయ్య యాదవ్, కాటం కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా సాలెకుల సురేశ్ యాదవ్, కోశాధికారిగా నాగిళ్ల విష్ణు, ముఖ్య సలహాదారులుగా గూడూరు ప్రభాకర్ రెడ్డి, కాకిరెడ్డి సంజీవ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా అమ్రోజు రవి, జాయింట్ సెక్రటరీలుగా గురు బ్రహ్మచారి, బి. ప్రశాంత్, కార్యవర్గ సభ్యులుగా ఎ. శ్రీనివాస్, బాల స్వామి, రామ దాసులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా  నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా కాలనీలో రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, భద్రత వంటి సమస్యలను పరిష్కరించేందుకు సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. ప్రాంత ప్రజల సహకారంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.