అంబేద్కర్ ఆశయాల జ్యోతి వెలిగిద్దాం

 అంబేద్కర్ ఆశయాల జ్యోతి వెలిగిద్దాం

నవాబుపేటలో ఘనంగా జయంతి వేడుకలు

నవాబుపేట, మన ఊరు ప్రతినిధి: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నవాబుపేట మండల కేంద్రంలో JK ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెకె ట్రస్ట్ డైరెక్టర్, సర్పంచ్ గీతారాణి అధ్యక్షత వహించారు. కార్యక్రమం ప్రారంభంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా జెకె ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వి. నరసింహచారి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, ఆయన చూపిన సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. తరువాత ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, అభిమానులు పాల్గొని భోజనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఈ కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.