ఘనంగా ఎల్‌ఐసీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా ఎల్‌ఐసీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు 

కల్వకుర్తి, ఏప్రిల్ 14 (మనఊరు ప్రతినిధి): డాక్టర్ బి.ఆర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కల్వకుర్తి ఎల్‌ఐసీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ సి. భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, న్యాయం కల్పించే దిశగా మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీఈయూ యూనియన్ అధ్యక్షుడు డి. హుస్సేన్ పాషా, ఎజెంట్స్ యూనియన్ సెక్రటరీ తాళ్ల సురేష్ గౌడ్, ఎజెంట్స్ కన్వీనర్ కనుక సత్యనారాయణ, కటికమ్ రమేష్ గౌడ్, స్టాఫ్ సభ్యులు ఎస్. ప్రవీణ్ రాజ్, సబ్ స్టాఫ్ యండి రవూఫ్, ఎస్‌కే ఖాజా, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని నాయకులు పిలుపునిచ్చారు.