వైభవంగా ఈదమ్మ గుడి బస్తి హిందూ సమ్మేళనం

వైభవంగా ఈదమ్మ గుడి బస్తి హిందూ సమ్మేళనం

హిందూ ఐక్యతే సమాజ బలం 

నాగర్‌కర్నూల్, మే 18 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి కాలనీలో సోమవారం నిర్వహించిన “ఈదమ్మ గుడి బస్తి హిందూ సమ్మేళనం” కార్యక్రమం వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో హిందువులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ఓం భారత్ శక్తి పీఠం వ్యవస్థాపకులు గురూజీ భారత నంద మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు బిల్లకంటి భాను ప్రకాష్ రావు, కార్యదర్శి గుళ్ల రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, ముమ్మడి విజయలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వక్తలు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం హిందూ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యతతో మెలగడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలని, సమిష్టి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా శక్తి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో కాలనీలోని చిన్నారులు సంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. అనంతరం పాల్గొన్న వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మేళన కమిటీ సభ్యులు శివ, సుభాష్, లక్ష్మీనారాయణ, శేఖర్‌బాబు, అంజి, శ్రీను, అనిల్, నిఖిల్, వినయ్, నాగరాజు, రవి, సంతోష్, శ్రీనివాస్‌రావు, నాగలక్ష్మి, ప్రసన్న, మంజుల, విజయ, కరుణాకర్, సుమన్ తదితరులతో పాటు వేలాదిగా హిందువులు పాల్గొన్నారు.