మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్ కొండల్

మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్ కొండల్ యాదవ్

వెల్దండ, మే 23 (మనఊరు ప్రతినిధి): వెల్దండ మండలంలోని ఉమ్మడి పోతేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పోచమ్మ తండాకు చెందిన రాత్లావత్ కామ్ల అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతూ శనివారం మృతిచెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కామ్ల పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కొండల్ యాదవ్, మృతుని కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.3 వేల రూపాయలను మృతుని భార్యకు అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “కామ్ల అకాల మరణం గ్రామానికి తీరని లోటు. ఇలాంటి క్లిష్ట సమయంలో మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తుకారం నాయక్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొని మృతునికి ఘనంగా నివాళులర్పించారు.