వెల్దండ ట్రైబల్ బాలికల హాస్టల్‌లో మైనర్ గర్భం ఘటన కలకలం

వెల్దండ ట్రైబల్ హాస్టల్‌లో మైనర్ గర్భం ఘటన సంచలనం

పోక్సో కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్ట్ చేయాలని బహుజన సంఘాల డిమాండ్

వెల్దండ బాలికల హాస్టల్‌లో దారుణం

మైనర్ విద్యార్థిని గర్భం ఘటనపై పారదర్శక విచారణ కోరుతున్న ప్రజలు

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.. 

వెల్దండ ట్రైబల్ హాస్టల్ ఘటనపై జిల్లా వ్యాప్తంగా చర్చ

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని బహుజన సంఘాల ఆందోళన

మైనర్ బాలిక గర్భం ఘటన ఆలస్యంగా వెలుగులోకి

వెల్దండ ట్రైబల్ హాస్టల్ వ్యవహారంపై కఠిన చర్యలు కోరుతున్న సంఘాలు

విషయం దాచిపెట్టారంటూ అధికారులపై తీవ్ర ఆరోపణలు

వెల్దండ ట్రైబల్ బాలికల హాస్టల్‌లో సంచలన ఘటన

 బాధ్యులపై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్

నాగర్‌కర్నూల్, మే 23 (మనఊరు ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో మైనర్ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2024–25 విద్యాసంవత్సరంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇప్పటివరకు సమగ్ర విచారణ జరగకపోవడంపై బహుజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉన్న హాస్టల్‌లో ఈ ఘటన జరిగినప్పటికీ విషయం బయటకు రాకుండా ప్రయత్నాలు జరిగాయని తాజాగా విధుల్లో చేరిన హాస్టల్ వార్డెన్ కొమ్ము జాన్సన్ ఆరోపించారు. హాస్టల్‌లో అనైతిక కార్యకలాపాలపై ఫిర్యాదులు రావడంతో 2026 మార్చి 11న అప్పటి జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అయితే మైనర్ బాలిక గర్భం దాల్చిన విషయం బయటపడకుండా అప్పటి ఇంచార్జ్ హాస్టల్ వార్డెన్‌తో పాటు కొంతమంది అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లు తెచ్చారని, తనను సస్పెండ్ చేయించేలా చర్యలు తీసుకున్నారని ప్రస్తుత వార్డెన్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 22న హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులపై వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి హాస్టల్ ఇంచార్జ్ వార్డెన్ కృష్ణవేణి, ప్రస్తుత జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఫిరంగిలను సస్పెండ్ చేయాలని బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే మాదిగ కులానికి చెందిన వార్డెన్ కొమ్ము బాబుకు జరిగిన అన్యాయంపై ఈ నెల 25న జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. మైనర్ బాలికకు సంబంధించిన ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.