వైశాఖ అమావాస్య సందర్భంగా పుష్పగిరి గిరివలయంలో విశేష పూజలు
కాలభైరవ స్వామి దేవస్థానంలో ఘనంగా ఏర్పాట్లు
వలూరు, మే 22 (మనఊరు ప్రతినిధి): కడప జిల్లా, వలూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుష్పగిరి గిరివలయం శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం లో వైశాఖ అమావాస్య సందర్భంగా శనివారం విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన నిర్వాహకులు తెలిపారు. జైష్ట అష్టమి పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, గిరివలయం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భక్తులు కాలభైరవ స్వామివారికి మినప వడల (గారెల) మాలలు సమర్పించనున్నారు. ఇలా సమర్పించడం వల్ల గ్రహదోషాలు, అపమృత్యు భయాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని నిర్వాహకులు తెలిపారు. అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనదలచిన భక్తులు ముందస్తుగా సంప్రదించాలని కోరారు. ప్రతి నెలా కాలభైరవ అష్టమి, అమావాస్య, అష్టమి, పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమాలను శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వివరాలకు ఈ నంబర్సం ను ప్రదించాలని 90306 56667 కోరారు.
