ఎంపీ డాక్టర్ మల్లు రవికి జడ్చర్ల కాంగ్రెస్ నాయకుల ఘన జన్మదిన శుభాకాంక్షలు
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
జడ్చర్ల రూరల్, జూలై 14 (మనఊరు ప్రతినిధి): నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి జన్మదినాన్ని పురస్కరించుకుని జడ్చర్ల కాంగ్రెస్ నాయకులు మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ మల్లు రవితో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో, నియోజకవర్గ అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో ఎంపీ డాక్టర్ మల్లు రవి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.
ఎంపీగా మల్లు రవి పదవీకాలంలో ముఖ్యాంశాలు
పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను ప్రస్తావించడం, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రహదారులు, తాగునీరు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కేంద్ర నిధుల సాధనకు కృషి చేయడం, యువత ఉపాధి అవకాశాల కల్పన, రైతుల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాల్లో ఎంపీ మల్లు రవి చొరవ చూపుతున్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ కృష్ణయ్య, గోప్లాపూర్ మాజీ సర్పంచ్ చెన్నయ్యతో పాటు జడ్చర్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
