అమరవీరుల స్మరణలో.. ప్రజల ఆరోగ్యానికి భరోసా!
పోలీస్ ఫ్లాగ్ డే వీక్ సందర్భంగా అమనగల్‌లో మెగా ఆరోగ్య అవగాహన శిబిరం
అమనగల్, అక్టోబర్ 24 (మనఊరు ప్రతినిధి): పోలీస్గ్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే వీక్–2026 సందర్భంగా అమనగల్ బస్టాండ్‌లో అమనగల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో Rxpert Super Speciality e-Clinics సహకారంతో మెగా ఆరోగ్య అవగాహన శిబిరం నిర్వహించారు. శిబిరంలో Rxpert వైద్యులు, సిబ్బంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య్షలిపారుణపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అమనగల్ మున్సిపల్ చైర్మన్ డా. పాథ్య నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అమనగల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్ఐ సంతోష్ కుమార్, ఏఎస్ఐ రామ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.




