భక్తి భావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి

భక్తి భావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి

సర్పంచ్ సుమీత్రభీమయ్య

కల్వకుర్తి, అక్టోబర్ 21 (మన ఊరు ప్రతినిధి): ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకుని ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలని సర్పంచ్ సుమీత్రభీమయ్య అన్నారు. మండలంలోని ఎల్లికట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి శోభాయాత్ర కార్యక్రమానికి యూత్ సభ్యులు వై. రమేష్ అధ్యక్షతన వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని బలపరుస్తాయని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం అమ్మవారి శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించగా మహిళలు బతుకమ్మ, యువత కోలాటంతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కేశవులు, హెల్పింగ్ ఫౌండేషన్ సభ్యులు రాఘవాచారి, మాధవరెడ్డి, రవి, భీమయ్య, ఆంజనేయులు, మహేష్, వెంకట్ రెడ్డి, నేతాజీ యువజన సంఘం సభ్యులు నాగిరెడ్డి, సందీప్, శ్రీనివాస్ రెడ్డి, సందీప్, సాయి గణేష్, సాయి కుమార్ ఎన్, సురేష్, మహేష్ ఎల్, శివాజీ, నల్లవోలు సాయి, బాలకృష్ణ, పవన్ చిట్టిపాల, పవన్ రామ్, గొడుగు రాజేందర్, రాజేందర్, సాగర్, ప్రవీణ్, శివ, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.