తన స్వయం ఉపాధి కోసం బాధం పాలు షేక్ - జ్యూస్ సెంటర్ వ్యాపారాన్ని మొదలు పెట్టిన శ్రీశైలం
భువనగిరి, ఆలేరు, మే 12 (మనఊరు ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూర్ (యం) మండల కేంద్రం లోని మెయిన్ రోడ్డు వద్ద బీసీ బలహీన వర్గాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం తన స్వంత కాళ్ళ మీద నిలబడడం కోసం స్వయం ఉపాధి నిమిత్తం
వేసవి కాలం లో ప్రజలకు ఉపశమనం కలిగించే భాదం పాలు షేక్ - జ్యూస్ సెంటర్ వ్యాపారాన్ని మొదలుపెట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తాపం నుండి ప్రజలు బయటపడటం కోసం తన వద్ద లభించే పరిశుభ్రమైన చల్లని బాధం షేక్ - జ్యూస్ లను సరసమైన ధరలలో సేవించాలని అన్నారు. శ్రీశైలం భాదం షేక్ జ్యూస్ సెంటర్ వద్ద ధరలు ఈ విధంగా ఉన్నాయి బాధం షేక్:20 రూ,,లస్సీ :20 రూ,,,కుల్ఫీ : 40 రూ,, ఫ్రూట్ సలాడ్ : 40 రూ,,ఖాజూ షేక్ :60 రూ,, లభిస్తాయని ఫంక్షన్ లకు ఆర్దర్స్ పై హోల్ సెల్ ధరలోనే అందజేస్తామని అన్నారు. ప్రజలు ఆదరించాలని కోరారు.