*కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి హల్ చల్*
*నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మోయిన్ బాబా*
*ప్రభుత్వ అధికారి అనధికార కార్యక్రమంలో పాల్గొనడం దేనికి నిదర్శనమని పట్టణవాసులు మండిపాటు*
ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వపరమైన, శాఖ పరమైన సేవలను అందించవలసిన అధికారులు అధికార పార్టీకి దాసోహం అవుతున్నారు. నిబంధనలను సైతం తుంగలో తొక్కి ఓ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలపై స్పందించేందుకు విసుక్కునే అధికారి పార్టీ కార్యక్రమంలో మాత్రం అన్ని తానై హల్చల్ చేసిన తీరును పట్టణవాసులు తప్పు పడుతున్నారు. షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తోపాటు పార్టీ ప్రధాన నాయకులు హాజరై ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదిలా ఉంటే అనధికార కార్యక్రమాలకు దూరంగా ఉండవలసిన షాద్ నగర్ మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ మోయిన్ బాబా వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఓ కార్యకర్తల వ్యవహరించారని పట్టణ వాసులు మండిపడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన అధికారులు, ప్రభుత్వ నిబంధనలను సైతం పట్టించుకోకుండా అధికార పార్టీకి దాసోహం అనే రీతిలో ఓ అధికారి వ్యవహరించడం దేనికి నిదర్శనమని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండవలసిన అధికారులు పార్టీల కార్యక్రమాలలో పాల్గొంటే ప్రజల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ శాఖల అధికారులు పార్టీల కార్యక్రమాలకు దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుతున్నారు. వర్ధంతి కార్యక్రమంలో మున్సిపల్ అధికారి పాల్గొన్న తీరును సైతం అధికార పార్టీ నాయకులు చర్చించుకున్నారని పలువురు వాపోయారు.