ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలి

 ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలి

ఐక్యత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు సుంకిరెడ్డి కృష్ణారెడ్డి

దేవాలయ అభివృద్ధికి రూ.2 రెండు లక్షల ఆర్థిక సాయం 




కల్వకుర్తి, మే 18 (మనఊరు ప్రతినిధి): ప్రతి ఒక్కరూ విధిగా దైవభక్తిని అలవర్చుకోవాలని, తద్వారా సమాజశాంతి నెలకొంటుందని ఐక్యత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు సుంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ తండాలో శ్రీశ్రీశ్రీ మేరామాయాడి విగ్రహప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఐక్యత ఫౌండేషన్ అధ్యక్షులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సమకూర్చిన రూ 2 లక్షలు దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు అయన కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనాలంటే విధిగా భగవంతుడ్ని ఆరాధించాలన్నారు. తాము సర్వమతాలను గౌరవిస్తామని, కులమతాలకతీతంగా పేదలకడగండ్లు తీ ర్చుతున్నట్టు చెప్పారు. నిత్యం స్వామి వారికి సేవలందించాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో ప్రతి పల్లెనూ అభివృద్ధి చేసేందుక అధ్యక్షులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా...

దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మేరమ్మయాడి దేవాలయానికి అభివృద్ధి చెపట్టెందుకు ఆర్థిక సాయం కోరడంతో వెంటనే ఐక్యత ఫౌండేషన్ అధ్యక్షులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్పందించి దేవాలయ అభివృద్ధికి రూ.2 రెండు లక్షలు దేవాలయ అభివృద్ధి కోసం అందజేశారని, దేవాలయానికి పెయింటింగ్, తదితర పనులు చెపట్టనున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి సహకరించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ రాజునాయక్, సభ్యులు బోడు నాయక్, భీమ్లా నాయక్, బాలు నాయక్, హర్యానాయక్, దేవేందర్, రాజేందర్, మొగలు నాయక్, గౌరీ, నరేందర్,లచ్చు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post