సాయి వంశీ కాలనీ కమిటీ అధ్యక్షులుగా శ్రీధర్
జడ్చర్ల రూరల్, మే 18 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మున్సిపాలిటీలోని సాయి వంశి కాలనీ ఫేస్ 1 లో ఆదివారం నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కే శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ గా బి నర్సింలు, ప్రధాన కార్యదర్శి ఏ.సుధాకర్ రెడ్డి, కోశాధికారి పి. రాఘవేందర్ గౌడ్, సహాయ కార్యదర్శిగి ఆర్ నరేందర్ గౌడ్, ఆర్గానైజింగ్ కార్యదర్శిగా బి రాజకుమార్, అడ్వైజర్ భాస్కర్, విష్ణు, సుధాకర్, కమిటీ మెంబర్స్ వెంకన్న గౌడ్, నరేష్, స్పోర్ట్స్ కన్వర్టర్ చందర్ నాయక్, శంకర్ నాయక్, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ నూతన అధ్యక్షుడు కే శ్రీధర్ నూతన కమిటీ సభ్యులు కాలనీవాసులు శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని కమిటీ సభ్యుల సహకారంతో కాలనీ అభివృద్ధి పరుస్తామని వారు పేర్కొన్నారు.