అలవోకగా సెంచరీ సాధించి భారత్ కు ఘన విజయాన్ని అందించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా పాకిస్థాన్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ వన్డే సెంచరీ సాధించి ఫామ్ ను అందిపుచ్చుకున్నాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 244 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ రిజ్వాన్ 77 బంతుల్లో 46 పరుగులు, షకీల్ 76 బంతుల్లో 62 పరుగులు సాధించారు. భారత్ బౌలర్లలో కుల్‌దీప్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకుకోగా, హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.ఇక భారత్ బ్యాటర్లలో స్కిప్పర్ రోహిత్ వర్మ 20 పరుగులు చేయగా, శుభమన్ గిల్ శుభ్‌మన్ గిల్ 46, శ్రేయస్ అయ్యర్ 56 పరుగులు చేశారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ తొలి బంతి నుంచీ సాధికారికంగా ఆడాడు. 111 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. వికెట్ల మధ్య చిరుతలా పరుగెడుతూ సింగిల్స్ సాధించాడు. కోహ్లీ ఏడు ఫోర్లు సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 51వ సెంచరీ. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.
Tags:
Sports