ఎంబి మెడికల్ ట్రస్ట్ ఆస్తులపై సుప్రీంకోర్టు తుది తీర్పు

 ఎంబి మెడికల్ ట్రస్ట్ ఆస్తులపై సుప్రీంకోర్టు తుది తీర్పు

విలేఖరుల సమావేశంలో వెల్లడించిన కల్వకుర్తి సాయిరెడ్డి

జడ్చర్ల, మే 17 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల పట్టణ సమీపంలోని కావేరమ్మపేటలో గల మెన్నోనెట్ బ్రాదరిన్ మెడికల్ ట్రస్ట్ ఆస్తులపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిందని  కల్వకుర్తి సాయిరెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల కావేరమ్మపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కావెరమ్మపేట పరిధిలోని సర్వే నంబర్ 36, 37, 58, 59 తదితర సర్వే నంబర్లలో దాదాపు 54 ఎకరాల భూమి ఎంబి మెడికల్ ట్రస్ట్ ఆస్తులను బ్యాంక్ ఆక్షన్‌లో కొనుగోలు చేసింది. సుప్రీం కోర్టు శుక్రవారం తుది తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావెరమ్మపేట శివారులో ఉన్న అత్యంత పురాతనమైన ఎంబి మెడికల్ ట్రస్ట్ అమెరికన్ ఆసుపత్రికి చెందిన 47 ఎకరాల 2006 సంవత్సరాల పంజాబ్ నేషనల్ బ్యాంకులో తాకట్టుపెట్టి ట్రస్ట్ చైర్మన్ ఆర్నాల్డ్ రూ ఆరు కోట్ల రుణాన్ని తీసుకొని అట్టి రుణాన్ని చెల్లించిక పోవడంతో బ్యాంకు అధికారులు అనేకమార్లు నోటీసులు ఇచ్చినా కోర్టులో వన్ టైం సెటిల్మెంట్ చేసిన ట్రస్ట్ వారు రుణాన్ని చెల్లించకపోవడంతో అట్టి రుణం కాస్త రూ 20 కోట్లు దాటిపోవడంతో చివరికి 2019లో చట్ట ప్రకారం ఎంబి మెడికల్ ఆస్తులను ఆన్‌లైన్ యాక్షన్ వేలం పాట నిర్వహించడంతో ఆన్ లైన్ యాక్షన్‌లో వారు పాల్గొన్నారు. 39 కోట్లకు ఆక్షన్‌లో 57 ఎకరాల భూమితో పాటు ఆసుపత్రిలోని భవనాలు సామాగ్రి దక్కించుకున్నామని కల్వకుర్తి సాయిరెడ్డి తెలిపారు. తాము ఆన్‌లైన్ యాక్షన్‌లో దక్కించుకున్న ఆ స్తుల గురించి ట్రస్ట్ చైర్మన్ ఆర్నాల్డ్ ట్రస్ట్ భూమిని ఆక్షన్‌లో ఎలా పెడతారని చట్ట విరుద్ధంగా బ్యాంకు వారు యాక్షన్ చేస్తారు నిర్వహించి సాయి రెడ్డి వర్గీయులకు అప్పగించారని, హైకోర్టులో కేసు వేయగా గత కొన్ని సంవత్సరాలుగా ట్రస్ట్ ఆస్తులపై వివాదం నడుస్తుంది చివరికి సుప్రీంకోర్టు ప్రకారం శుక్రవారం బ్యాంకు వారు యాక్షన్ లో చట్టబద్ధంగా డబ్బులు చెల్లించి ఎంబి ట్రస్ట్ ఆస్తులు 47 ఎకరాల ఎంబి మెడికల్ ట్రస్ట్ భూములు సాయిరెడ్డి వర్గీయులు కొనుగోలు చేసిన అట్టి భూమిని కల్వకుర్తి సాయిరెడ్డి వర్గీయులు స్వాధీన పరుచుకోవడానికి పూర్తి అర్హులైన డిఎ ఆర్టి (డెబిట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్) అప్పీల్ నంబర్ 3/2024 ద్వారా సుప్రీం తీర్పు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాము చట్టం ప్రకారం ముందుకు వెళ్లామని, ఎలాంటి అవకతవకలు బ్యాంకులు చేయలేదని వారు యాక్షన్‌లో పెడితేనే తాము కొనుగోలు చేశామని తమకు న్యాయం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు తీర్పు ప్రచారం తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంబి మెడికల్ ఆస్తులను స్వాధీనపరచుకుంటామని ఆయన తెలిపారు. 

Post a Comment

Previous Post Next Post