31న ఉచితకంటి ఆపరేషన్ శిబిరం..

 31న ఉచితకంటి ఆపరేషన్ శిబిరం..

నాగర్ కర్నూల్, జూలై 25 (మనఊరు ప్రతినిధి): జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 31న గురువారం నాడు ఉదయం 9 నుంచి 11గంటల వరకు ఉచిత కంటి చికిత్స శిబిరము నిర్వహిస్తున్నట్లు నాగర్ కర్నూలు ఆప్తాలమిక్  అధికారి కొట్ర బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలోని గది నెంబర్ 102లో కంటి శిబిరం ఉదయం 9 నుంచి 11గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరంలో రోగులకు ప్రత్యేక కంటి పరీక్షలు, సాధారణ పరీక్షలు నిర్వహించి, అందులో అవసరమైన వారికి, క్యాటరాక్టు పొర గల వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో నిర్వహించ నున్నట్లు తెలిపారు. రోగులకు ప్రత్యేక అంబులెన్స్ ద్వార ఏనుగొండకు పంపనున్నట్లు తెలిపారు. రోగులు ముందుగా బి.పి,షుగర్ పరీక్షలు చేసుక్కొని రిపోర్టు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఈ ప్రాంత రోగులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఏదేని గుర్తింపు కార్డు అయన జిరాక్స్ కాపీ, ఫోన్ నెంబర్ ని తమ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. వివరాలకు 9440876556, 7386940480 లను సంప్రదించాలన్నారు.

Previous Post Next Post