ఆసుపత్రిలో గర్భిణీలకు స్కానింగ్ సౌకర్యం ప్రారంభం

 *ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో గర్భిణీలకు స్కానింగ్ సౌకర్యం ప్రారంభం*

రోగులకు అందుబాటులో డిజిటల్ ఎక్స్-రే , సిటీ స్కాన్.

మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి.ఉషారాణి



నాగర్ కర్నూలు, జూలై 14 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో గర్భిణీలకు స్కానింగ్ సౌకర్యం వసతి కల్పించినట్లు ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి.ఉషారాణి తెలిపారు. సోమవారం నాడు గర్భిణీలకు అవసరమయ్యే ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఆసుపత్రికి రేడియాలజిస్ట్ వైద్యులు రిపోర్టు చేయడంతో స్కానింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చామని ఆమె తెలిపారు. సోమవారం నుండి శనివారం వరకు గర్భవతులకు స్కానింగ్ సేవలు ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా యాక్సిడెంట్ లలో గాయపడిన వారికి మరియు పలు వ్యాధుల నిర్ధారణ నిమిత్తం డిజిటల్ ఎక్స్ రే ప్రతిరోజు 80 నుంచి 90 రోగులు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక వ్యాధి నిర్ధారణ నిమిత్తం అవసరమైన రోగులకు సిటీ స్కాన్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో రేసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ ప్రశాంత్ , డాక్టర్ రోహిత్, రేడియాలజిస్ట్ డాక్టర్ ఈ. ఈశ్వరి, గ్రేడ్ వన్ మెడికో సోషల్ వర్కర్స్ సి.జ్యోతి, వి. విజయలక్ష్మి, డి.బాలమ్మ, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి.యాదగిరి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post