బీసీలు అన్ని రంగాలలో ఎదగాలి

బీసీలు అన్ని రంగాలలో ఎదగాలి

బీసీలు ఐక్యంగా పోరాడాలి..

మార్చాల గ్రామంలో బీసీ సంఘం నాయకులు 

కల్వకుర్తి, జూలై 27 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామంలో బీసీ కమ్యూనిటీ ప్రవేశ బీసీ సంఘం నాయకులు ఆదివారం సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం పైగా ఉన్న బిసిలు ఉన్నామని గుర్తు చేశారు, కేవలం ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రశ్న కాదు, సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో బిసిల అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది. ఆత్మ గౌరవానికి అన్ని రంగాలలో గొంతు కోసం డిమాండ్ చేసే ప్రశ్నే బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, గౌరవం అనేది సంపదలతో వచ్చేది కాదన్నారు. సామాజిక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వివక్షతో, వెలివేతలతో కూడుకొని ఉందని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఉన్నారు.

 

Previous Post Next Post