భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయం శ్రీదేవి

 భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయం శ్రీదేవి 






హైదరాబాద్, జులై 21 (మనఊరు ప్రతినిధి): భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల నిలయం శ్రీదేవి అని ప్రముఖ సామాజికవేత్త పివిపి ఆంజనీ కుమారి అన్నారు. సోమవారం చిక్కడపల్లిలోని త్యాగరాజ గాన సభ మెయిన్ హాల్లో మయూరి నృత్య లయ సంస్కృతిక సేవ సమితి వారి కూచిపూడి భరతనాట్యము ప్రదర్శన సందర్భంగా హాజరై మాట్లాడుతూ శ్రీదేవి రాజనాలకు గురు పౌర్ణమి సందర్భంగా....వందనాలు గురువులకు పాదాభివందనాలు.. గురువులకు వందనాలు పాదాభి వందనాలు అని అన్నారు, గురువులకు అభినందనలు తెలిపే సభా కార్యక్రమంలో పాల్గొన్న సభను ఉద్దేశించి శ్రీదేవి రాం కుమార్ రాజనాల ఈ సంస్థ స్థాపించి దాదాపు 14,15, సంవత్సరాలు కావొస్తుంది భ్యభ్యహ్మ్హ్మ్ విద్యార్థులకు ఒక పది కాలాలపాటు గుర్తు చేసుకునే విధముగా కళలో పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చి పిల్లలను కూచిపూడి భరతనాట్యము, పేరని నృత్యం లలో వాళ్ల ఎదుగుదలలలో తన పాత్ర చాలా గొప్పది, గురువులు తమ సంసారం తమ పిల్లలని చూసుకుంటూ మరి మన పిల్లలకు కలల పట్ల అభిరుచి కలిగే విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తూ వారి ఎదుగుదలకు ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు, ఆ పాత్ర కళ్ళల్లో కావచ్చు చదువులో కావచ్చు కానీ మనం మన పిల్లలకి ఏమి చేస్తున్నావు వారి అభిరుచులకు అనుకూలంగా మనము ఉన్నామా లేక డబ్బే జీవితానికి ఆధారం అని ఆ ప్రపంచంలో బతుకుతూ పిల్లలకు ఒక సెల్ ఫోన్ వారికి కావాల్సిన వాటికంటే ఎక్కువ సౌకర్యాలు ఇస్తూ వారి జీవన విధానంలో పెను మార్పులకు మనము కారణం అవుతున్నాము ఈ మాట నిజమా కాదా అది మీరు మీ ఆత్మ సాక్షిగా ఒకసారి ఆలోచించండి ఈరోజు పిల్లలతో పాటు తల్లిదండ్రులు వారితో పాటు బంధువులు ఇంతమంది ఈ త్యాగరాజ సంఘాల సభ మెయిన్ హాల్ ఫుల్ అయిపోయాయి చాలామంది బయట కూడా నిలబడ్డారు, ఇలాంటి వాతావరణం మనకి సినిమాలలో సినిమా హాల్స్ లో దొరుకుతుందా? అసలు ఫ్యామిలీ తో ఒక సినిమా చూసే వాతావరణం ఈరోజుల్లో ఉందా ? అంటే ఉమ్మాటికి లేదనే చెప్పగలము, కానీ ఇలాంటి కార్యక్రమాలు మన కుటుంబ సభ్యులే కాదు మన స్నేహితులు మన బంధువులతో కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనము ఎంతో సంతోషముగా ఈరోజు చూస్తున్నాము, దీని కారణం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గ్యాప్.. అది డబ్బే కావచ్చు లేదా సెల్ ఫోన్ కావచ్చు లేదా కంప్యూటర్ యుగం కావచ్చు.. మన స్థితిగతులు బట్టి మనం అంచనా వేసుకోవచ్చు, మన రోజువారి సమయంలో కొంత టైం పిల్లలతో కలిసి వారి అభిరుచులకు ప్రాధాన్యతీ మన సాంప్రదాయ సాంస్కృతిక గురించి వారికి చెబుతూ మనం ముందుకు సాగితే వస్తదైన కుటుంబం సమాజానికి మనం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము.. ప్రస్తుత పరిస్థితుల్లో నృత్య గురువులు దొరకటం అందులో శ్రీదేవి లాంటి కళల పట్ల భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగిన వాళ్లు దొరకటం చాలా అదృష్టం, ఇలాంటి అవకాశాలను మనము అందిపుచ్చుకొని పిల్లలకి చదువుతోపాటు కలల పట్ల వాళ్లకి అవగాహన కల్పిస్తే మనతో పాటు మన సమాజం కూడా ఒక ఆహ్లాద వాతావరణంలో ఉంటూ నేటి యువతకు ఒక రుచికరమైన సమాజాన్ని ఇవ్వగలిగిన వాళ్ళము అవుతాము... మన కుటుంబంలో ఒక వ్యక్తి లాగా సెల్ఫోన్ కొనసాగుతున్నది అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ కుటుంబాలకి కుటుంబ బాంధవ్యాలకి దూరంగా ఉంటున్నాము, నేటి యువత ఎదుగుదలను ప్రముఖ పాత్ర గురువులదే అలాంటి గురువులను మనము అభినందిస్తూ గురువులకు వందనాలు తెలియజేస్తూ శ్రీదేవి లాంటివాళ్ళు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ సమాజానికి ఒక మేలుకొలుపుగా ఉంటూ రాష్ట్ర అవార్డ్స్ కాకుండా నేషనల్ అవార్డ్స్ కి వాళ్ళ మయూరి నృత్య సేవా సమితి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమంలో నన్ను భాగ్య స్వాములను చేసినందుకు శ్రీదేవి గారి శిష్య బృందానికి మరియు రామ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు అని అన్నారు అలాగే ప్రముఖ సినీ ఆర్టిస్ట్ శ్రీ చింత కుంట మాణిక్యరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని తల్లిదండ్రులకు మరియు గురువులకు మంచి పేరు తీసుకురావాలి. మేము కూడా కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వాళ్ళమే, సినిమా వాళ్లు అంటే చాలా గొప్ప జీవితం గడుపుతున్నారు అని అందరూ అనుకుంటారు దాని వెనక ఎంతో కృషి పట్టుదల ఉంటేనే మనము ఎదగగలము అని అన్నారు, "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు'"అన్న ఎన్టీ రామారావు గారు అడివి రాముడు సినిమాలో పాట ఎంతో స్ఫూర్తి నిస్తుంది నేటి సమాజానికి అని ఆయన ఎన్టీఆర్ ని ఈ సందర్భంగా గుర్తు చేసినారు, వర్ధమాన నటుడు రమాకాంత్ మాట్లాడుతూ మేము షూటింగ్ లలో ఒక్కొక్క పాట చాలాసార్లు చేస్తాము కానీ పిల్లలు చాలా కష్టపడి నేర్చుకొని నృత్యాన్ని కంటిన్యూ చేస్తూ ప్రదర్శిస్తున్నారు నిజమైన హీరో హీరోయిన్స్ అంటే వీళ్ళే అని విద్యార్థులను కొనియాడారు పిల్లలకి చదువుతోపాటు కళ లో వారికి ఉత్సాహపరిచే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అన్నారు, సినీ ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ విజయ్ కుమార్, విజయ చరిత్ర పత్రిక ఫౌండర్, అండ్ ఎడిటర్ ,శ్రీ విజయకుమార్ మాట్లాడుతూ ఈ కూచిపూడి భరతనాట్యం భారతదేశానికి తల మాణికం లాంటి విద్యలు దీనిలో పిల్లలు అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని చదువుతోపాటు పాటు ఇలాంటి కళ లో వారి నైపుణ్యాన్ని పెంపొందించుకొని అటు తల్లిదండ్రులకు ఇటు సమాజానికి మంచి పేరు తీసుకు రాగలరని అన్నారు, శ్రీమతి శ్రీదేవి రామ్ కుమార్ రాజనాల, గారికి హృదయపూర్వక అభినందనలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పిల్లలకి ఒక నృత్య గురువుగా మీరు చూపిస్తున్న ప్రోత్సాహం చాలా అద్భుతం అమోహం,.. పిల్లలను కూచిపూడి భరతనాట్యం కథక్ సంప్రదాయ కళ లో వారికి అవగాహన కల్పిస్తూ మీరు చేసే కృషి నేటి సమాజానికి ఒక మేలుకొలుపుగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు నేను పాల్గొనటం చాలా సంతోషముగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో గురువులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post