కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్న
మున్సిపల్ చైర్ పర్సన్ పుష్పలత
జడ్చర్ల రూరల్, (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డు శ్రీ శ్రీ శ్రీ సత్యనారాయణస్వామి కాలనీ లో గురువారం నాడు స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత పర్యటించారు. కాలనీలో కుంటుపడిన అభివృద్ధిని చూసి నివ్వెరపోయారు. ఈ కాలనీలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలనీ మొత్తంలో ఒక్క సి సి రోడ్డు లేకపోవడం, డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో కాలనీవాసులు చైర్ పర్సన్ కు తమ సమస్యలను చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె కాలనీ వారితో మాట్లాడుతూ త్వరలోనే కాలనీలో సి సి రోడ్లు, డ్రెయిన్ లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సతీష్, కుమ్మరి రాజు, చైతన్య చౌహాన్. కాలనీ అధ్యక్షులు ప్రభాకర్, ఉపాధ్యక్షులు ఇల్లెందుల శ్రీకాంత్, కాలనీ పెద్దలు రమేష్ గౌడ్, నాగరాజు గౌడ్, గోల్డెన్ రాజేష్, నర్సింహా గౌడ్, జెటు ఓజా కూరగాయల నర్సింహ, కాంగ్రెస్ నాయకులు అశోక్ యాదవ్, అనంత కిషన్, విజయ భాస్కరెడ్డి తదితరులు ఉన్నారు.