ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలి టాస్క్ సిఒఒ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

 ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలి

టాస్క్ సిఒఒ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 



అమనగల్, ఏప్రిల్ 14 (మనఊరు ప్రతినిధి): సమాజంలో ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలని టాస్క్ సిఒఒ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చెన్నంపల్లి (మాలేపల్లి) గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావనతో నడుచుకోవాలని, భక్తితో ఉంటే మంచి పనులు చేయాలనే ఆలోచనలు వస్తాయని తెలిపారు. నిత్యం భగవంతుడిని స్మరించడంతో ప్రతి ఒక్కరి జీవనం సుఖసంతోషాలతో వర్ధిలుతుందన్నారు. భగవంతుడి ముందు అందరూ సమానమేనని, ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడాలని అన్నారు. స్వామి వారి ఆశీస్సులతో చెన్నంపల్లి గ్రామస్తులందరు పాడి పంటలతో, సుఖసంతోషాలతో, ఉండాలని కోరుకుంటున్నానని, స్వామి ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమణారెడ్డి, మండల అధ్యక్షులు జగన్, సీనియర్ నాయకులు బొబ్బిలి, ఆలయ కమిటీ సభ్యులు లక్మయ్య, వెంకటేష్, రవి, నరసింహలతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, దుడ్డు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post