మహోన్నత వ్యక్తి అంబేద్కర్ ఆయన జీవితం అందరికీ ఆదర్శం
టాస్క్ సిఒఒ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
కల్వకుర్తి, ఏప్రిల్ 14 (మనఊరు ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త అని టాస్క్ సిఒఒ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మండలంలోని గుండురులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరిలో ఉన్నత చదువులు చదివేలా చైతన్యం కలిగించారన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన భారతరత్న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామని, బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామని, అంబేడ్కర్ కలలుగన్న సమాజాన్ని నిర్మించుకుందామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు కిష్టారెడ్డి, వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య, స్థానిక నాయకులు భరత్ రెడ్డి, సత్యనారాయణ, శవెంకటరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, నాగేందర్, మహేష్, నరసింహ, శేఖర్, పర్షరాములు, చెన్నయ్య, బండి లక్మయ్య, యుగంధర్, కుమార్, ప్రసాద్, పండు, సతీష్, శ్రీశైలం, సూర్యకుమార్ లతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.