*కల్వరి కొండపై ఘనంగా ఈస్టర్ సూర్యోదయ ఆరాధన*
జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 20 (మనఊరు ప్రతినిధి): యునైటెడ్ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో సామూహిక ఆరాధన పట్టణంలోని ఇందిరానగర్ జడ్చర్ల నందు గల కల్వరి కొండపైకి యేసు క్రీస్తు ప్రభువు మరణము జయించి తిరిగి లేచాడని దేవుడు మృత్యుంజయుడు యేసయ్య అని జయనదాలతో కొండ పైకి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు గీతాలాపన చేశారు ఈస్టర్ సందేశాన్ని రెవ. రాజశేఖర్ అందించినారు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి మూడవరోజు లేచాడని సర్వ మానవాళి కొరకై తాను చూపించిన ప్రేమ, విధేయత, నమ్మకత్వం మనందరికి ఒక మాదిరి అని పలికారు ఈ కార్యక్రమంలో పాస్టర్ కె.విలియం బూత్,ఫిలమోన్, తిమోతి, జైపాల్, నిత్యానందం, లూథర్, మైఖేల్ మనోహర్, దేవదానం, ఎబినేజర్, ఐజాక్, ప్రీతమ్, సందీప్, జాన్సన్, రూబెన్, టైటస్, ఆశీర్వాదం,నతనేయాలు,మోజస్, సాగర్, డాక్టర్.సందీప్, సాల్మన్, మోహన్ రాజ్, ఫిలిప్,సునీల్, డేవిడ్ ,సుస్మిత్, బన్నీ రాజ్, రాజు, సన్నీ, యాకోబు, సుందర్ పాల్, ఏలీయాజార్,జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.