ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 20 (మనఊరు ప్రతినిధి): ఈ నెల 14 నుంచి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. వారం రోజులపాటు జడ్చర్ల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజేందర్ ఆధ్వర్యంలో విస్తృతంగా అగ్ని ప్రమాద నివారణ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. మొదటిరోజు విధి నిర్వహణలో ప్రాణాలు పోల్పోయిన సిబ్బందికి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. రెండవ రోజు నివాస భవనాలలో ఎల్పిజి సిలిండర్స్ లీకై సంభవించే అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. మూడవరోజు ఆసుపత్రిలో జరిగే అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. నాలుగో రోజు అగ్నిమాపక జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేశారు. ఐదవ రోజు పెట్రోల్ పంపులలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఆరవ రోజు సినిమా థియేటర్లలో అగ్ని ప్రమాదల నివారణపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక పరికరాల ఉపయోగించు విధానము ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మాన్ రాఘవేందర్, లక్ష్మీకాంత్ రెడ్డి, డ్రైవర్ ఆపరేటర్స్ సురేష్, వెంకటేష్, ఫైర్ మెన్స్ నవీన్ కుమార్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.