*పౌష్టికాహారం తో సంపూర్ణ ఆరోగ్యం*
_ *లక్ష్మీ పల్లి లో ఘనంగా పోషణ పక్షోత్సవాలు*
దేవరకద్ర, ఏప్రిల్ 19 (మనఊరు ప్రతినిధి): పౌష్టికాహారం తో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ *గీతా కుమారి* అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న పోషణ పక్షోత్సవాలలో భాగంగా శనివారం దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి లోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ గీతా కుమారి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలున్న పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తారని పేర్కొన్నారు.ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలని ముఖ్యంగా ప్రతి రోజు ఆహారంలో చిరు ధాన్యాలు తీసుకోవాలని సూచించారు. జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త *లయన్ అశ్విని చంద్రశేఖర్* మాట్లాడుతూ పాలు, పండ్లు,గుడ్లు, కూరగాయలు, ఆకు కూరలు, మిల్లెట్స్ వివిధ రకాల పోషక పదార్థాల ప్రాముఖ్యత గురించి వివరించారు. చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాంచంద్రయ్య, ప్రాథమిక పాఠశాల హెచ్ యం ఎస్.కల్పన, ఉన్నత పాఠశాల ఇంచార్జ్ హెచ్ యం కోటకద్ర మురళీధర్, ఉపాధ్యాయులు ఎ.చంద్రశేఖర్, ఎ ఎన్ యం మంజుల, ఆశా కార్యకర్త బి.నందిని, అంగన్వాడీ టీచర్లు బి.లక్ష్మీ, పాండమ్మ , ఆయాలు శైలజ, రాధ, గర్భిణీలు, కిశోర బాలికలు , తదితరులు పాల్గొన్నారు.