పసికందు మృతదేహంతో మంత్రుల పర్యటనలో నిరసన..

 పసికందు మృతదేహంతో మంత్రుల పర్యటనలో నిరసన..

ములుగు, ఏప్రిల్ 19 (మనఊరు ప్రతినిధి): ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మూలాన పసికందు మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన బిల్లా రవళి గురువారం ఉదయం డెలివరీ కోసం ములుగు ఏరియా ఆసుపత్రిలో చేరగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నార్మల్ డెలివరీ కోసం వైద్యులు వేచి చూస్తున్న క్రమంలో గర్భిణీ పరిస్థితి బాగా లేకపోవడంతో.. ఆపరేషన్ అన్న చేయండి లేకపోతే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తామని కుటుంబ సభ్యులు కోరారు.

దీంతో డాక్టర్లు బలవంతంగా నార్మల్ డెలివరీకి ప్రయత్నించగా.. పురిటిలోనే పసిబిడ్డ చనిపోవడం, అటు తల్లి పరిస్థితి విషమించి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని బాధితులు వాపోయారు. 

తమకు న్యాయం చేయాలని పసిబిడ్డ మృతదేహంతో జాతీయ రహదారిపై బయటాయించి నిరసన తెలిపారు. ములుగు జిల్లా కేంద్రం నుండి వెళ్తున్న మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,మంత్రి కొండ సురేఖలకు చనిపోయిన పసిబిడ్డ మృతదేహాన్ని చూపిస్తూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాతమయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం మూలాన్ని తమ బిడ్డ చనిపోయిందని, బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై పసిబిడ్డతో నిరసన తెలుపడం, అప్పుడే మంత్రులు అక్కడికి చేరుకునే క్రమంలో పోలీసుకు కుటుంబ సభ్యులకు కాసేపు తోపులాట జరగడంతో కాసేపు ఉద్రుక్త వాతావరణం నెలకొంది. 

అటుగా వెళుతున్న మంత్రి సీతక్క విషయం తెలుసుకుని ప్రత్యేకమైన కమిటీ వేసి ఏం జరిగిందో తెలుసుకుంటారని, బాధ్యులపై చర్య తీసుకుంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Post a Comment

Previous Post Next Post