మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి
బాలానగర్, మే 16 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలో 44వ నంబర్ జాతీయ రహదారి ముఖ్య కూడలిలో జాతీయ రహదారిపై ఉపరితల వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. మండలకేంద్రా నికి నిత్యం వేల మంది ప్రజలు, వాహనదారులు పలు పనుల నిమిత్తం వస్తుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్య ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. జాతీయ రహదారుల సంస్థకు సంబంధించిన అధికారులు, జాతీయ రహదారిపై ప్రయాణం చేసే వాహనాలను సర్వీస్ రోడ్డు ద్వారా మళ్లించారు. దీంతో వాహనదారులు నిదానంగా తమ వాహనాలను నడపడం ద్వారా టాపిక్ సమస్య ఏర్పడుతుంది. అంతేకాక సర్వీస్ రోడ్డు కేవలం ఒకే వాహనం ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండడంతో వెహికల్స్ ఒకటి వెంట మరొక వెహికల్ నిదానంగా ప్రయాణం చేస్తున్నాయి ఈ పరిణామంతో భారీ ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది సమస్యను పరిష్కరించాలని, వాహనాలకు పాదాచారులకు ప్రత్యామ్నాయంగా మరోక రహదారిని లేదా ప్రస్తుతమున్న రహదారి పైననే డివైడర్లను తొలగించి ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.