*అంశం: కర్పూరం*
1.
దవళ రూప కర్పూరం
దైవత్వానికి ప్రతిరూపం
పూజా హారతికిది పుష్పం ఆధ్యాత్మికతకు అపురూపం పూజకు పరిపూర్ణపు రూపం
హారతి కర్పూర దీపం త్యాగానికి ప్రతీక కర్పూరం
కర్పూరం లేని పూజ అసంపూర్ణం
ఉప్పులేని కూర రుచి అగమ్యం
గృహమున కానరాదు పుణ్యమూర్తుల త్యాగనిరతి కర్పూర పోలికకు గతి విజయపరంపరకు హారతి చీడపీడల నాసిని
క్రిమి కీటక నిర్మూలిని ఆరోగ్యపు హారతి
సదా నీకు శరణాగతి...
సత్యవీణ మొండ్రేటి
2.
ఉప్పు కర్పూరమని వేమన శతకమునందు మంచితనానికి చోటుపొందినది....
మల్లె పూవు వోలె చూడగ మరులు గొల్పునది....
ఎన్నెన్నో రూపాలలో ఉపయోగార్ఖమై లభించునది....
దేవుని ముందట హారతిగా మారి నింపును హృదయాన భక్తిని...
పరిమళభూయిష్టమై మనస్సున కలిగించును అనురక్తిని....
కాంతిని వెదజల్లి మదిలోన వెలిగించును ఆధ్యాత్మిక జ్యోతిని...
దేహ అనారోగ్యాలకు దివ్యౌషధమై ఉపయోగపడును..
బియ్యముతోడ కలిపి ఆఘ్రాణించిన జలుబును తగ్గించును...
కొబ్బరి నూనెతో కలిపి వెలిగించిన దోమలను ప్రారద్రోలును...
పుదీనాతో మిళితం చేసి మర్ధించిన కండరాల బాధను తొలగించును....
గోడల మూలల చేర్చిన క్రిమి కీటకాల ప్రవేశాన్ని ఆటంకపరుచును....
బట్టల మధ్యన దాచిన వస్త్రాలకు పట్టు పురుగు పని పట్టును...
కంఫోరా పేరుతో పిలువబడే వృక్ష మూలము నుండి జనించి....
కంపును పోగొట్టే పరిమళాలను వెదజల్లి..
మానసికాహ్లాదము కలిగించును స్వచ్ఛ ధూమమును సృష్టించి...
కర్పూరం బహుళ ప్రయోజనకారి...
అత్యంత భక్తి జనిత కారి...
రోగ బాధల ఉపసంహరి....
జి. మధుమురళి
3.
కర్పూరం... హారతి కర్పూరం
కలతలు తీర్చేది ఈ కర్పూరం
కలకాలం అండయే ఈ
కర్పూరం
కాపురాలు నిలబెట్టేదే ఈ కర్పూరం
సుగంధద్రవ్యమే ఈ కర్పూరం
క్రిమి సంహారిణి ఈ కర్పూరం
దంపతులకు సౌఖ్యం ఈ కర్పూరం
పిన్నలకు దీవెన ఇచ్చు ఈ కర్పూరం
దేవుని పూజకు ముఖ్యం ఈ కర్పూరం
దైవంకరుణకు తప్పనిదీ
కర్పూరం
దేవతారాధన పూర్తికి ఈ కర్పూరం
దినదినమూ ప్రతిఇంట కర్పూరం
శుభకార్యాలకు నిండుదనం ఈ కర్పూరం
శరీరానికి చల్లదనమిచ్చు ఈ కర్పూరం
శుభోదయవేళహారతిచ్చేదే ఈకర్పూరం
శిరస్సు పోటు నివారణకు ఈ కర్పూరం
ఆధ్యాత్మికకు ప్రతీక ఈ కర్పూరం
ఆరోగ్యమునకు కావాలి
4
ఈ కర్పూరం
అందానికి వాడుతారు ఈ కర్పూరం
ఆడవారి అలంకరణకు కావలి ఈ కర్పూరం
బట్టలు పాడవనీయదీ కర్పూరం
బీరువాలో బిళ్ళలుయే ఈ కర్పూరం
బాహ్యచర్మానికి వాడేదీ
కర్పూరం
భవబంధాలుఆస్థిరమని చెప్పేదే ఈకర్పూరం
టి. సోమశేఖర శర్మ