పంట మారుద్దాం.. దిగుబడి పెంచుదాం

 పంట మారుద్దాం.. దిగుబడి పెంచుదాం

పంటల మార్పిడితే భూసార వృద్ధి

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిదాలయం ప్రొఫసర్ త్రివేణి



కల్వకుర్తి, మే 15 (మనఊరు ప్రతినిధి): పంటమార్పిడి విధానంతో పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా భూసార సంరక్షణ, పోషక లోపాల నివారణ జరిగి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిదాలయం ప్రొఫసర్ ఎస్, త్రివేణి తెలిపారు. గురువారం మండలంలోని ఎల్లికట్టలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిదాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతు అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ అధునాతన వ్యవసాయంపై అవగాహన కల్పించి చైతన్యవంతుల చేయడం ద్వారా రైతులు పంటలో మంచి దిగుబడి సాదిస్తారన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు రసాయనిక ఎరువులను, పురుగుల మందులను తగ్గించి పంట పండించడం రైతులకు ఎంతో లాభదాయకమని చెప్పారు. సహజ వనరులు, పంట మార్పిడి, చెట్ల పెంపకం, సాగునీటి యాజమాన్యం, విత్తనాలు, రసాయనాల కొనుగోలు చేసిన రసీదులను భద్రపరుచుకోవడం వల్లే చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల మోతాదును తగ్గించి-సెంద్రియ ఎరువులు వాడినప్పులు 10-20·1. పంట పంటించే ఖర్చును తగ్గించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. స్వరుపరాణి, ఎఈవో, రైతులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post