ఘనంగా కట్ట మైసమ్మ బోనాల పండుగ
దామర్ గిద్ద, మే 13 (మనఊరు ప్రతినిధి): దామర్ గిద్ద మండలంలోని లక్ష్మీపూర్ చెరువు కట్ట మీద ఉన్న కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాలు మంగళవారం గ్రామంలోని మహిళలు అమ్మవారికి బోనాలతో మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లతో పోతరాజులు విన్యా సాలు చేస్తూ ఊరేగింపు తీశారు. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని కరువు కటకాల నుంచి అందరిని కాపాడాలని భక్తులు అమ్మ వారిని వేడుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో బోనాలు భాగం అని మైసమ్మ తల్లి అందరిని కాపాడమ్మా అని మొక్కులు తిర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.