_*కాంగ్రెస్ తోనే సర్వతో ముఖాభివృద్ధి*_
_*కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సిఎంఆర్ఏప్ చెక్కుల పంపిణీ
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, మే 21 (మనఊరు ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు, గ్రామీణ ప్రాంతాలు సైతం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తున్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని కళ్యాణసాయి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సర్వతో భివృద్ధి సాధిస్తుందని, మారుమూల ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం ప్రభుత్వ పథకాలు గడపగడపకు చేరుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబడిందన్నారు. పల్లె ప్రాంతాల్లోని నిరుపేదలు సైతం ఎమ్మెల్యేలు ఎంపీలు, మంత్రులు, తినే సన్న బియ్యం భోజనాన్ని ప్రతి ఇంట్లో తింటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం నిజమైన లబ్ధిదారులకు అందుతుందని మరో మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలననే కొనసాగుతుందనీ, రానున్న లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెపిలిపించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన 503 మందికి లబ్ధిదారులకు 12626000 కోట్ల రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా 201 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు సంబంధించి 20122316 కోట్ల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్లు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఆయా మండలాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సింగిల్ విండో అధ్యక్షులు డైరెక్టర్లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, వనపర్తి మా మున్సిపల్ మార్చి వైస్ చైర్మన్, పట్టణ మాజీ కౌన్సిలర్లు, యువకులు మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.