*క్షయ వ్యాధిగ్రస్తులకు 25 న్యూట్రిషన్ కిట్ల పంపిణీ*
బిజినపల్లి, మే 21 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశానుసారం నాట్కో ఫార్మా కంపెనీ వారి ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు బలవర్ధకమైన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేసినట్లు బిజినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం.శివకుమార్ తెలిపారు. వ్యాధి తగ్గడానికి ప్రభుత్వం ఉచితంగా అందజేసిన మందులతో పాటు బల వర్ధకమైన పౌష్టిక, సమతుల్య ఆహారం అధిక మొత్తంలో తీసుకోవాలని పోషక విలువలు బలవర్ధకమైన ఆహారం వారికి అత్యంత అవసరం అని అన్నారు. ఒక వైపు మందులు, ఒకవైపు ఆహారం తీసుకున్నప్పుడే వ్యాధి తీవ్రత తగ్గి సమర్థవంతంగా ఆరోగ్యంగా ఉండుటకు శరీరం సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాట్కో ఫార్మా కంపెనీ డిప్యూటీ మేనేజర్ సూర్యనారాయణ, డాక్టర్ మదన్ కుమార్, రమణారెడ్డి, టిబి సూపర్ వైజర్ శ్రీనివాసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది రమేష్ కుమార్, గంగ, మంగ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.