*ఆర్టిఐ చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం*
ఆర్టీఐ ఫోరమ్ వనపర్తి జిల్లా కోశాధికారి గా బడికిని మహేందర్ నాయుడు ఎన్నిక
నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేష్
వనపర్తి, మే 18 (మనఊరు ప్రతినిధి): సమాచార హక్కు చట్టం (ఆర్.టి.ఐ) ప్రజల చేతుల్లో ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని వనపర్తి జిల్లా కోశాధికారి బడికిని మహేందర్ అన్నారు. సమాచార హక్కు చట్టం ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ వనపర్తి జిల్లా కోశాధికారి గా బడికిని మహేందర్ నియమితులయ్యారు. వనపర్తి జిల్లా అధ్యక్షులు జి.రవికుమార్ అధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైయినా మహేందర్ మాట్లాడుతూ... సామాన్యుడి చేతిలో వజ్రాయుధమైన సమాచార హక్కు చట్టంపై యువత అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలుకు కృషి చేస్తానని అన్నారు. ఆర్టీఐ పై అవగాహన కార్యక్రమాలు చేపడతానని, సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.ఆర్టిఐ చట్టం విషయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఆర్టిఐ చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారితనం సాధ్యమన్నారు. తన పైన ఉన్న నమ్మకంతో తనకు బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. యువత విధిగా ఈ చట్టంపై అవగాహన పెంచుకుని గ్రామీణులను చైతన్యం చేయాలని కోరారు.