*ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు*
*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*
*పదేండ్ల బిఆర్ఎస్ పాలనను చూసి విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు*
షాద్ నగర్, మే 18 (మనఊరు ప్రతినిధి): ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.గత పాలకులు రాష్టాన్ని దోసుకుని దాసుకున్నారే తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ధ్యాసే వారికి ఆనాడు లేదని విమర్శించారు. ఆదివారం మండల పరిధిలోని వై ఏం తండా, చింతగట్టుతండా, సిద్ధాపూర్, ఎస్బిపల్లి గ్రామాలలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎస్బి పల్లి గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసేదే చెబుతుందని, చెప్తే చేస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తుందని ఆయన అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజల గురుంచి ఆలోచించని బి ఆర్ ఎస్ నాయకులు అధికారంలోకి వచ్చి కొద్దికాలమే అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం విడ్డురంగా ఉందని అన్నారు.వారి పాలనా కాలంలో గ్రామాలలో ఉండే కారు పార్టీ నాయకులు పెద్ద పెద్ద ఇండ్లు భవంతులు కట్టుకున్నారు కానీ పేదలు..ఇల్లు లేని వారి గురించి ఏనాడైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని తెలిపారు. అలాగే ఎస్ బీ పల్లి గ్రామస్తులు చిరకాల కోరికైనా పొలాలకు బీటీ రోడ్డు వేయడంను తొందర్లోనే ప్రారంభిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొంగల్లా హరినాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లారం శేఖర్ రెడ్డి, వీరమోని దేవేందర్ ముదిరాజ్, మాజీ ఎంపిటిసి కొమ్ము కృష్ణ, మామిడి సిద్దార్థ రెడ్డి, ఎమ్మె సత్తయ్య, విజయ్,ఎస్ బి పల్లి సురేష్, ప్రవీణ్, రవికుమార్ గుప్తా, దేవేందర్, మహేందర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.