*దేశ అభివృద్ధిలో "రాజీవ్" హస్తం*
*షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"*
*షాద్ నగర్ లో మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ 34 వర్ధంతి నివాళి*
*రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు*
*ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ అందజేసిన కాంగ్రెస్ పార్టీ*
షాద్ నగర్, మే 21 (మనఊరు ప్రతినిధి): అతిపిన వయసులోనే భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించి దేశ భవిష్యత్తుకు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు నేడు అభివృద్ధికి ఎంతో కీలకమని భారత స్వామి కీర్తిశేషులు రాజీవ్ గాంధీ అని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ 34 వర్ధంతి నివాళిని ఘనంగా అర్పించారు. ఈ సందర్భంగా ఫరూక్ నగర్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శంకర్ కాంగ్రెస్ శ్రేణులు కలిసి పెద్ద ఎత్తున పూలమాలలు అర్పించి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బ్రెడ్ పండ్లు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. అతిపిన్న వయసులోనే ప్రధాన మంత్రి పదవిని అధిష్ఠించిన రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్తుకు నాడు నాటిన అభివృద్ధి మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందించేయనీ అన్నారు. ఆయన దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ సరళీకృతం చేయడం, పరిశ్రమలకు రాయితీలు, పంచా యతీ రాజ్ వ్యవస్థ పటిష్ఠ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారనీ, 21వ శతాబ్దిలో దేశాన్ని నూతన పథంలో నడిపించేలా దిశానిర్దేశం చేశారన్నారు. ఆయన యువతరంలో శక్తిమంతమైన మార్పును ఆకస్మికంగా కంప్యూటర్ యుగానికి నాంది పలకడంతో ఇప్పుడు దేశం ప్రగతి దిశలో పయనిస్తోందనీ నాటి ప్రధానిగా ఉన్న ఇందిర ముష్కరుల చేతిలో హత్యకు గురవడంతో దేశ ప్రజల ఆకాంక్ష, ఒత్తిడి మేరకు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ గాంధీ 1984 అక్టోబర్ 31న భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు చేపట్టారనీ వివరించారు.1984 డిసెంబర్‌లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాజీవ్‌ని కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో 414 స్థానాలు గెలిచిందనీ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లేందుకు ప్రధానలక్ష్యంతో 'పబ్లిక్ కాల్ ఆఫీస్' (పీసీఓ) ప్రవేశ పెట్టడం ద్వారా సాధారణ ప్రజలకు కూడా కమ్యూనికేషన్ కనెక్టివిటీ వీటీ పెరిగింది. రాజీవ్ ప్రభుత్వం అత్యాధునిక టెలి కమ్యూ నికేషన్ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయడానికి 1984లో 'సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్' స్థాపించిందనీ 19855 విద్యను సార్వత్రికీకరించడానికి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ'ని ప్రారంభించారనీ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఓపెన్ యూనివర్సిటీల ప్రారంభానికి ఇది స్ఫూర్తిగా నిలిచిపోయింది. బడుగు, బల హీన వర్గాలకు ప్రయోజనాలు కలిగేలా జాతీయ విద్యా విధా నాన్ని విస్తరించాలనే లక్ష్యంతో 1986లో రాజీవ్ గాంధీ దేశంలో 'జవహర్ నవోదయ' విద్యాలయాల'ను. గ్రామీణాభిమురికి ప్రాధాన్యమిస్తూ పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989 మే 15వ తేదీన 64వరాజ్యాంగ సవరణకు అనుగుణంగా పీవీ నరసింహారావు ప్రభుత్వం 1993లో చేసిన 73వ రాజ్యాంగం సవరణతోపంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది. మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే తలంపుతో రాజీవ్ గాంధీ 1985లో దీనికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి పీవీ నరసింహారావుకు అప్పగించారు. దేశ రాజకీయాల్లో ముఖ్యంగా 1967 తర్వాత పార్టీ ఫిరాయింపులు ఎక్కువవడంతో వాటి కట్టడికి రాజీవ్ నడుం కట్టారు.1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 'పార్టీ ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని 10వ షెడ్యూల్‌లో చేర్చడంతో పార్టీలు మారే ప్రజాప్రతినిధుల సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశా లు ఏర్పడతాయి.రాజీవ్ గాంధీ చేసిన చరిత్రాత్మక చట్టాల్లో 61 వరాజ్యాంగ సవరణ బిల్లు కీలకమైంది. దేశ నిర్మాణంలో యువతను మార్చడానికి ఉన్నతమైన ఆశతో ఈ చట్ట సవరణ ద్వారా ఓటు వేసే కనీస వయస్సు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు తగ్గించారు. దీనితో దేశ రాజకీయాల్లో యువత పెరగడమే కాకుండా తమ ఆశలకు అనుగుణంగా ప్రజాప్రతి నిధులను ఎన్నుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. రాజీవ్ ప్రచారంలో హడ విడిగా ఉన్న గాంధీ 1991లో ఎన్నికల సమయంలో మే 21 రాత్రి పెరంబదూర్ లో ప్రచారం నిర్వహించగా మనోభాంబు పేల్చి ఎల్టిఈ తీవ్రవాదులు హత్య చేసిన దేశం కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, నేతలు అగ్గనూర్ బస్వో, చెండి తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రఘు నాయక్, జృమద్ ఖాన్, అందే మోహన్, సాయి వంశీ, హరినాద్ రెడ్డి, ఇబ్రహీం, మురళి మోహన్(అప్పి), కొప్పునూరి ప్రవీణ్, రాజేష్ గౌడ్, ఖదీర్, మాధువులు, అర్జున్, సీతారాం, నవీన్, ఖదీర్, మంగ అశోక్, నీరటి వాసు, మన్నె రవి, రాజు, గంగమోని సత్తయ్య, సాయి కుమార్, శేకరప్ప ,రవితేజ, ముబారక్ అలీ ఖాన్,బచ్చలి నరేష్, విగ్నేష్ రెడ్డి, శంకర్,మంగ మధు, మహమ్మద్, కొనసాగుతున్నారు.