తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా జడ్చర్ల తహసిల్దార్ నర్సింగ్ రావు
జడ్చర్ల రూరల్, మే 6 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ హైదరాబాదులో ట్రేసా భవనంలో నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ (ట్రెసా) మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా జడ్చర్ల తహసిల్దార్ సి. నర్సింగరావు ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా దేవరకద్ర డిప్యూటీ తహసీల్దార్ కాలేద్దీన్ ఎక్బాల్, అసోసియేట్ అధ్యక్షుడిగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ఏవో శంకర్ లు ఎంపికయ్యారు. మంగళవారం హైదరాబాద్ ట్రెసా భవన్ లో నిర్వహించిన సమావేశంలో ట్రేసా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా నర్సింగరావును ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన నర్సింగరావు ప్రస్తుతం జడ్చర్ల తాసిల్దార్గా కొనసాగుతున్నారు. ప్రసాద్ రాష్ట్ర నాయకులు వంగ రవీందర్ రెడ్డి, గౌతమ్ లతోపాటు రాష్ట్ర నాయకులు ఈ ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల 21న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నూతన అధ్యక్ష కార్యదర్శులు, అసోసియేటెడ్ అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా తెలుస్తోంది. నూతన కార్యవర్గాన్ని మహబూబ్ నగర్ జిల్లా ట్రెసా నాయకులు అభినందించారు. రెవిన్యూ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.