నీటి సంపులో పడి చిన్నారి నిహాన్సి మృతి

 నీటి సంపులో పడి చిన్నారి నిహాన్సి మృతి 

కౌకుంట్ల, మే 6 (మనఊరు ప్రతినిధి): నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన కౌకుంట్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన కథనం మేరకు.. కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి గ్రామానికి చెందిన రమేష్, జ్యోతి దంపతుల కుమార్తె నిహాన్సి(4) సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడింది. ఆ సమయంలో తండ్రి పని నిమిత్తము కౌకుంట్ల మండల కేంద్రానికి వెళ్లగా తల్లి ఇంట్లో పని చేస్తుంది. కొంత సమయానికి తన కూతురు కనిపించట్లేదని వెతకగా సంపులో విగత జీవిగా కనిపించింది. విగత జీవిగా ఉన్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఇస్రంపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Post a Comment

Previous Post Next Post