అనుమతులు లేకుండా అక్రమ వండ్రుమట్టి తరలింపు..

 గంగాపూర్ లో అనుమతులు లేకుండా అక్రమ వండ్రుమట్టి తరలింపు..

మట్టి మాఫియా ఇష్టారాజ్యం

నిత్యం వందల టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలింపు

ప్రభుత్వ ఆదాయానికి గండి



జడ్చర్ల రూరల్, మే7 (మన ఊరు న్యూస్): బంగారం లాంటి ఒండ్రుమట్టి బజారు పాలు అవుతోంది. రైతుల పొలాల్లో కి చేరాల్సిన చెరువు మట్టి పాడుపడిన బావులు పూడ్చడానికి ఉపయోగపడుతోంది. వివరాల్లోకి వెళితే. జడ్చర్ల మండలంలోని గంగాపూర్ చెరువులను మట్టి మాఫి యా చెరబట్టింది. నల్ల ఒండ్రుమట్టిని పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. గంగాపూర్ చౌడమ్మ చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా రోజుకు 100 ట్రాక్టర్లులో ఎక్స్ కవేటర్ తో 500 ట్రిప్పుల చొప్పున శ్రీ భవ్య సీడ్ కంపెనీ యజమాని ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారు. 

తరలించిన మట్టిని రైతు పొలాల్లో ఒండ్రు మట్టి గా వాడుకుంటే పర్వాలేదు. కానీ రియల్ దందాలు కోట్లు పెట్టి కొన్న భూముల ఎత్తుపల్లాలను చదును చేయడానికి ఉపయోగిస్తున్నారు. వందల ట్రిప్పుల చొప్పున శ్రీ భవ్య సీడ్ కంపెనీ యజమాని తరలించారు. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో రైతులు పొలాలకు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మట్టి తరలించేవారు. ఈ చెరువు శిఖంలో 30 ఎకరాలలో ప్రభుత్వం శిఖం భూమి పట్టా అందించింది. గంగాపూర్ లో కొందరి దళారులను సంప్రదించి ఈ కంపెనీ యజమాని అక్రమం ఒండ్రు మట్టి దందాకు తెర లేపారు, ఏకంగా పెద్ద మొత్తంలో ఒండ్రు మట్టి తరలించి గుంతలుగా మారిన సీడ్ కంపెనీ యజమాని పొలంలో ఈ మట్టి తరలింపు చేశారు, నీటిపారుదల శాఖ మైనింగ్ శాఖ అధికారులను మంచిగా చేసుకొని ఈ తతంగమంతా జరుపుతున్నట్లు స్పష్టమవుతుంది, ఇలా చెరువులు మీటర్ లోతు గుంతలు ఎక్కడపడితే అక్కడ ఏర్పడ్డాయి, జాలరులు చేపలు పట్టినప్పుడు ఈ గుంతలు ప్రమాదకరంగా మారాయి, ఈ విషయంపై స్థానిక రెవెన్యూ అధికారులను వివరణ కోరగా మైనింగ్ శాఖ నుండి గాని రెవిన్యూ శాఖ నుండి గాని ఎలాంటి తరలింపుకు అనుమతులు లేవని తెలిపారు, మైనింగ్ శాఖకు క్యూబుక్ మీటర్ కు రాయల్టీ కింద 60 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, ఇలా అక్రమంగా తరలించిన ఉండు మట్టి ఫీడ్ కంపెనీ యజమాని పొలంలో గుంతలు పూడ్చడానికి మాత్రమే హృదయానికి మారిందని, వ్యవసాయ రైతులకు కులాలు ఉండుమట్టి తరలించాలంటే పక్క గ్రామాలకు వెళ్లే పరిస్థితి నెలకొంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు, 

నీటిపారుదల శాఖ అధికారులు ఎక్కడ..?

జడ్చర్ల పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపూర్ చౌడమ్మ చెరువులో అక్రమ మట్టి తరలింపు కు ఎలాంటి అనుమతులు లేవు, ఈ విషయం మా దృష్టికి రాలేదు, ఇకనుండి ఇలా జరగకుండా చూసుకుంటాం... అంటూ నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు సమాధానం ఇస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post