ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
బిజినపల్లి, మే 7 (మనఊరు ప్రతినిధి): జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు బుధవారం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ వింత జరిగినా 'బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు' అనడం మనం వింటుంటాం. అంత గొప్ప కాలజ్ఞాని, రాజయోగి, హేతువాది, తత్త్వవేత్త, మహిమాన్వితుడు, సంఘ సంస్కర్త, దైవ స్వరూపులుగా వినుతికెక్కిన శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి వారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ భక్తులు పుట్టోజు శంకరాచారి, వడ్ల సత్యం, ప్రభాకర్ ఆచారి, శ్రీకాంత్ చారి, శ్రీనివాస్ చారి, వట్టెం వీరాచారి, కృష్ణచారి, ప్రవీణ్ చారి, వట్టెం శివ చారి, రామాచారి, యుగేంద్రచారి, వీరాచారి, సుధాకర్ చారి, భక్తులు పాల్గొన్నారు.