అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు..

 అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు..

 దేవరకద్ర మే 4 (మనఊరు ప్రతినిధి): దేవరకద్ర ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు జి, మధుసూదన్ రెడ్డి ఆదివారం జన్మదిన వేడుకలు దేవరకద్ర నియోజకవర్గం అంతటా అట్టహాసంగా అంగ రంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.. దేవరకద్ర నియోజకవర్గంలో భూత్పూర్, అడ్డాకుల, చిన్న చింతకుంట, కౌకుంట్ల, కొత్తకోట  మండల కేంద్రాలతో పాటు, గ్రామ గ్రామాన ఎమ్మెల్యే జన్మదిన వేడుకల కేకులను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, సాయిబాబా, మహేందర్ నాయుడు, దేవేందర్, అజ్జకొల్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post