మార్కెట్ చైర్మన్ ను పరామర్శించిన ఎంపీ రఘురాంరెడ్డి
రఘునాధ పాలెం, మే 4 (మ ఊరు ప్రతినిది): జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రగర్ల హనుమంతరావు తండ్రి పిచ్చయ్య ఇటీవల మరణించగా.. వారి స్వవగ్రామానికి వీ.వెంకటాయపాలెం వెళ్లి.. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఆదివారం పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ కాపా ఆదినారాయణ, కిలారు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.