రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి

 *రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.*

 *కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణి వీడనాడాలి..*

*సిపిఎం మండల కన్వీనర్ ఈశ్వర్ నాయక్..*

షాద్ నగర్, మే 7 (మనఊరు ప్రతినిధి): నిత్యం ప్రమాదాలు గురవుతున్న పట్టించుకోకుండా రోడ్లు రోడ్డుపై కంకర వేసి వదలడం సమంజసం కాదని సిపిఎం మండల కన్వీనర్ ఈశ్వర్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోడ్డు కమ్మదనం నుండి మధురపూర్ రోడ్డు నిర్మాణం సందర్భంగా రోడ్డు కాంటాక్ట్ తీసుకున్న వ్యక్తి కేవలం రోడ్డుపైకి అందరు వేసి వదిలేయడం ద్వారా అనేక ప్రమాదాల గురవుతున్నారని అనేకమంది ప్రమాదాల గురి ఆసుపత్రుల పాలవుతున్నారని వారు అన్నారు. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని, నిర్మాణ పనులు చేపట్టేందుకు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేయడం అన్యాయమని మండిపడ్డారు.. కొత్త రోడ్లు నిర్మాణ పనుల కోసం బూడిద కంకరాళ్లు వేయడంతో దాని ద్వారా వచ్చే దుమ్మూ ధూళి వల్ల పాదచారులకు, వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. వాహనాల వేగం వల్ల రాళ్లు ఎగురుకుంటూ ప్రయాణికులపై పడే ప్రమాదం గతంలో జరిగిందని, దీనివల్ల అనేక మంది గాయాలపాలైనట్టు తెలిపారు. వాహనాల రాకపోకల వల్ల దుమ్మూ, ధూళి పెరగడంతో ఎదురుగావచ్చే వాహనాలు కనిపించే పరిస్థితి లేదని, దానివల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉండదని వివరించారు. కావున వెంటనే ఆర్‌ అండ్‌ బి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్బంగా వారు డిమాండ్‌ చేశారు.

Post a Comment

Previous Post Next Post