హ్యాండ్ బాల్ ను గ్రామ స్థాయి వరకు విస్తరించేలా కృషి చేయాలి
.jpg)


జడ్చర్ల రూరల్, జులై 27 (మనఊరు ప్రతినిధి): హ్యాండ్ బాల్ ను గ్రామ స్థాయి వరకు విస్తరించేలా కృషి చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడీ తెలంగాణ పీడీ,పి ఈ టి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దూమర్ల నిరంజన్ అన్నారు. ఆదివారం జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్ లోని ఎస్వీకేయం పాఠశాలలో ఉమ్మడి మహబూబ్జి నగర్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడీ తెలంగాణ పీడీ,పి ఈ టి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దూమర్ల నిరంజన్ హాజరై మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో హ్యాండ్ బాల్ క్రీడా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేద్దామని అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంపు లను నిర్వహించి క్రీడను గ్రామ స్థాయి వరకు విస్తరించే విధంగా కృషి చేద్దామని, ఉమ్మడి జిల్లాలో హ్యాండ్ బాల్ క్రీడాకారులకు కుదువ లేదని ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తెచ్చారని అన్నారు. మండల స్థాయిలో హ్యాండ్ బాల్ క్రీడా క్లబ్బులు ఏర్పాటుచేసి గ్రామీణ యువకులను సైతం క్రీడల వైపు మళ్ళిద్దమన్నారు. అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ గా గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులుగా సయ్యద్ తాకియుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా శంకర్ నాయక్, కోశాధికారిగా కాల్వ రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సహాయ కార్యదర్శులుగా 25 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ నుండి చింతకాయల పుల్లయ్య జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ నుండి శరత్ చంద్ర అబ్జర్వర్ గా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తిరుమలయ్య వ్యవహరించారు. నల్గొండ జిల్లా అండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఉస్మాన్, మహబూబ్ నగర్ జిల్లా పీడీ, పీఈటి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య, కోశాధికారి మొగులాల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బాధ్యులు వెంకటేష్, షోయబ్ అలీ, మన్యం రాఘవేందర్, యాదయ్య, రవి, ఉమాశంకర్, ప్రశాంత్, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.